తగ్గేదేలే.. కొండెక్కి కూర్చున్న కొక్కొరకో.. కేజీ ధర ఎంతో తెలుసా!

20 Mar, 2022 12:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆదివారం వచ్చినా, దోస్త్‌ల దావత్త్‌లు, ఫంక్షన్‌లకు వెళ్లినా ఇలా అకేషన్‌ ఏదైనా చికెన్‌ లేకపోతే చాలా మందికి ముద్ద దిగదనే సంగతి తెలిసిందే. అలాంటి చికెన్‌ ప్రియులకు ఇది చేదు వార్తే. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చికెన్‌ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా పెరిగిన చికెన్‌ రేట్లతో మన మనీ ఖాళీ అవ్వాల్సిందే. నిన్నటి వరకు డబుల్‌ సెంచరీ దాటిన చికెన్ ఈ సారి ఏకంగా ట్రిబుల్‌ సెంచరీని క్రాస్‌ చేసి సామాన్య ప్రజలకు షాకిచ్చింది!

ధర తగ్గేదేలే..
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ ధరలు చూస్తే మధ్య తరగతి ప్రజలు కొనాలాంటే భయపడేలా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం.. కిలో చికెన్ (స్కిన్ లెస్) రూ.300కు విక్రయిస్తున్నారు. కొన్ని వారాల క్రితం వరకు రూ.200 లోపు ఉండేది. అయితే తాజాగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర రూ.300లకు పైగా ఉంది. విజయవాడలో కేజీ ధర రూ.306 ఉండగా, హైదరాబాద్‌లో 290 నుంచి 300 వరకు చికెన్ ధర పలుకుతోంది. ఈ ధర చూసి చికెన్ కొనేందుకు మాంసం ప్రియులు జంకుతున్నారు. ప్రస్తుతం నిత్యావసర సరుకులతోపాటు చికెన్ కూడా కొనలేని పరిస్థితికి చేరిందనంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: పళ్లు తోముకుంటూ వేపపుల్ల మింగేశాడు.. ఆ తర్వాత.. )

అయితే చికెన్ ధరలు పెరగడానికి అనేక కారణాలు.. అందులో పౌల్ట్రీ ఫారాల్లో వినియోగించే దాణా రేటు పెరగడం, వేసవి ఉష్ణోగ్రతల కారణంగా కోళ్లు చనిపోతున్నాయని, బర్డ్ ఫ్లూ లాంటి వదంతుల కారణంగా కొత్త జాతులు ఉత్పత్తి కావడం లేదని పౌల్ట్రీ రైతులు తెలిపారు. వీటి కారణంగా మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు సరిపడా కోళ్ల సరఫరా లేకపోవడం వీటి ధరలను అమాంతం పెరుగుతున్నట్లు వ్యాపారలు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు