నాగుపాముకు సిమెంట్‌ కట్టు 

21 Mar, 2022 04:27 IST|Sakshi
పాముకు సిమెంట్‌ కట్టు కట్టిన దృశ్యం 

వనపర్తి: నాగుపాము అంటేనే భయంతో పరుగులు పెడతాం. కానీ సర్పరక్షకుడిగా పేరొందిన సాగర్‌ స్నేక్‌ సొసైటీ వ్యవస్థాపకుడు, హోంగార్డు కృష్ణసాగర్‌ తీరే వేరు. ఎక్కడైనా పాము కనిపించిందని ఫోనొస్తే.. తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలేస్తారు. ఆదివారం వనపర్తి పట్టణం నాగవరం శివారులో కదిరెపాడు ధర్మయ్య ఇంటి నిర్మాణానికి పునాది తీస్తుండగా  మట్టిపెడ్డలు పడి నాగుపాముకు గాయమైంది. ఇది గమనించి వారు కృష్ణసాగర్‌కు సమాచారమిచ్చారు.

గాయంతో పాము ఇబ్బంది పడుతుండటం చూసి ఆయన పశువైద్యాధికారి ఆంజనేయులును ఆశ్రయించారు. ‘దాని ఎముక విరిగినట్టుంది.. ఎక్స్‌రే తీస్తేగానీ వైద్యం చేయలేం’ అని డాక్టర్‌ తేల్చారు. చివరకు డా.పగిడాల శ్రీనివాస్‌రెడ్డి ఆస్పత్రిలో పాముకు ఎక్స్‌రే తీశారు. పాముకు ఎముక విరగడంతో సిమెంట్‌ కట్టు వేశారు.దానికి చికిత్స పూర్తయ్యాక వనపర్తి చిట్టడవిలో వదిలేస్తానని కృష్ణసాగర్‌ తెలిపాడు.  

మరిన్ని వార్తలు