ముఖరా(కె) సర్పంచ్‌కు ‘స్వచ్ఛ సుజల్‌ శక్తి సమ్మాన్‌’

5 Mar, 2023 05:28 IST|Sakshi

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కే) సర్పంచ్‌ గాడ్గె మీనాక్షి ‘స్వచ్ఛ సుజల్‌ శక్తి సమ్మాన్‌–2023’ అవార్డును అందుకున్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛ్‌ భారత్‌ గ్రామీణ్‌ విభాగంలో కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మీనాక్షికి ఈ అవార్డును అందించారు. 220 ఇళ్లు ఉన్న ముఖరా(కె) గ్రామం ఓడీఎఫ్‌ ప్లస్‌ కేటగిరీలో చోటుదక్కించుకుంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తమ గ్రామాభివృద్ధి వివరాలను మీనాక్షి వివరించారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు