బీజేపీది ప్రైవేటైజేషన్‌.. బీఆర్‌ఎస్‌ది నేషనలైజేషన్‌: సీఎం కేసీఆర్‌

18 Jan, 2023 17:29 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: దేశంలో ప్రబలమైన మార్పునకు ఖమ్మం బీఆర్‌ఎస్‌ భేరి ఒక సంకేతమని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పేర్కొన్నారు. అంతకు ముందు సభకు హాజరైన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులకు, రాష్ట్ర నేతలకు, పార్టీ కేడర్‌కు ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

అనంతరం, ఖమ్మం జిల్లాకు వరాలు ప్రకటించారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు. 589 గ్రామాలకు రూ. 10లక్షల చొప్పున, ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, మధిర, వైర, సత్తుపల్లి మున్సిపాలిటీలకు రూ. 30కోట్లు ప్రకటించారు. 

తర్వాత.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ మాట్లాడుతూ.. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా?. దేశంలో విచిత్రమైన పరిస్థితి ఉంది. దేశ మార్పునకు ఈ సభ ఓ సంకేతం. విదేశీ సాయం అవసరం లేనంత వనరులు దేశంలోనే ఉన్నాయి. లక్ష కోట్ల ఆస్తి మన దేశం సొత్తు. దేశంలో 83 కోట్ల సాగు అనుకూల భూములున్నాయి. కానీ, ఇంకా యాచకులుగానే ఎందుకు ఉండాలి?. ఆహార ఉత్పత్తుల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ప్రభుత్వాల మెడలు వంచేలా పోరాటం జరగాలి. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పెట్టిందే బీఆర్‌ఎస్‌.

ఇంకా రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు అవసరమా?. రాష్ట్రాల మధ్య కేంద్రం గొడవలు పెడుతోంది. బకెట్‌ నీళ్ల కోసం చెన్నై కన్నీరు పెట్టుకోవాలి. ఈ దుర్మార్గాలకు కాంగ్రెస్‌, బీజేపీనే కారణం. బీజేపీది ప్రైవేటైజేషన్‌ అయితే బీఆర్‌ఎస్‌ది నేషనలైజేషన్‌. తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ కరెంట్‌ కోతలు ఉన్నాయి అంటూ కామెంట్స్‌ చేశారు. పథకాలను బీజేపీ అమలు చేయకపోతే బీఆర్‌ఎస్‌ అమలుచేస్తుంది. ఎల్‌ఐసీని అమ్మేయ్‌.. ఫర్వాలేదు. మేము మళ్లీ తీసుకుంటాము. ఎల్‌ఐసీ ఉద్యోగులు సింహాల్లా గర్జించాలి. 2024 తర్వాత మోడీ ఇంటికి.. మేము ఢిల్లీకి వెళ్తామన్నారు. కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని సభా వేదికగా హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు