దావోస్ పర్యటనలో తెలంగాణ సీఎం.. రేవంత్‌ ట్వీట్‌

16 Jan, 2024 11:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌(స్విట్జర్లాండ్‌)లో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్‌కు వెళ్లిన సీఎం.. 19వ తేదీ వరకు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) 54వ సమావేశంలో పాల్గొననున్నారు.

ప్రపంచ ఆర్థిక సదస్సు నుంచి ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ ప్రచారాన్ని మొదలు పెట్టామని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ఐటీ, జీవవైవిధ్య రంగంలో తెలంగాణ ప్రాధాన్యత, అనుకూలతలను ప్రముఖులతో చర్చించామని పేర్కొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశం జరిగిందన్నారు. ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలసికట్టుగా పనిచేస్తే ప్రజలు సంపన్నులుగా మారతారని రేవంత్‌ అన్నారు.

తెలంగాణ పారిశ్రామిక విధానంపై ఇథియోపియా ఉప ప్రధానితో చర్చ జరిగిందని, రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్‌ కోసం చేపట్టవలసిన కార్యక్రమాలపై నాస్కామ్ ప్రతినిధులతో చర్చలు జరిగాయని సీఎం రేవంత్‌ వివరించారు.

>
మరిన్ని వార్తలు