వేడుకలను ఆపాలని ఆదేశించలేం: హైకోర్టు

1 Jan, 2022 04:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో న్యూఇయర్‌ వేడుకలను ఆపేలా ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని తేల్చిచెప్పింది. కేంద్రం ఈ నెల 21, 27న జారీ చేసిన కరోనా నియంత్రణ మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, న్యూఇయర్‌ వేడు కల సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలను వివరిస్తూ ఈ నెల 4లోగా స్థాయీ ని వేదిక సమర్పించాలని ఆదేశించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ టి.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు ప్రభుత్వం అనుమతించడాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. 

మరిన్ని వార్తలు