అలంపూర్‌ క్షేత్రానికి మహర్దశ: కిషన్‌ రెడ్డి 

23 Aug, 2021 01:39 IST|Sakshi
త్వరలో జోగుళాంబ దేవిని దర్శిస్తానన్న కేంద్ర మంత్రి  

సాక్షి, హైదరాబాద్‌: అలంపూర్‌ జోగుళాంబ ఆలయాలకు మహర్దశ రానుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్‌ శర్మ ఆదివారం హైదరాబాద్‌లోని దిల్‌కుషా అథితి గృహంలో మంత్రి కిషన్‌రెడ్డికి జోగుళాంబ దేవి రక్షా కంకణం, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడారు. అలంపూర్‌ జోగుళాంబ ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్‌ స్కీమ్‌ మంజూరు చేసిందని చెప్పారు. అతి త్వరలోనే తాను కుటుంబ సమేతంగా జోగుళాంబ దేవిని దర్శించుకుంటానన్నారు.  

మరిన్ని వార్తలు