3 రోజుల పాటు తెలంగాణ సాహితీ లిటరరీ ఫెస్ట్‌

27 Oct, 2022 15:37 IST|Sakshi
లిటరరీ ఫెస్ట్‌ బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న ఆనందచారి

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో నవంబర్‌ 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ సాహితీ లిటరరీ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కె.ఆనందచారి తెలిపారు. బుధవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో లిటరరీ ఫెస్ట్‌ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లిటరరీ ఫెస్ట్‌లో వాగ్గేయ కారుల సమ్మేళనంతోపాటు సినిమా పాటల సాహిత్యంపై సెమినార్‌ ఉంటుందన్నారు. సుమారు 85 మంది కవులు రాసిన సినిమా పాటల సాహిత్యంపై వ్యాసాల పత్ర సమర్పణ ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది పాటకు పట్టం కడుతూ.. గీత రచయితలను, గీతాలాపకులను, వాగ్గేయ కారులను, సినిమా సాహిత్యకారులను ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

కార్యక్రమంలో తెలంగాణ సాహితీ రాష్ట్ర నాయకులు రాంపల్లి రమేష్, అనంతోజు మోహన కృష్ణ, తంగిరాల చక్రవర్తి, ఎస్‌.కె. సలీమా, రేఖ, శరత్, ప్రభాకరచారి, రామకృష్ణ, చంద్రమౌళి, పేర్ల రాములు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: సమాజం విస్మరించిన అసలైన కోవిడ్‌ వారియర్స్‌ వాళ్లే)

మరిన్ని వార్తలు