థియేటర్లు తెరిచేందుకు అనుమతివ్వాలి

3 Oct, 2020 13:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అన్‌లాక్‌ 5.0లో భాగంగా క్టోబర్‌ నుంచి సినిమా థియేటర్లు తెరవడానికి కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్రంలో థియేటర్ల పునః ప్రారంభంపై చర్చించేందుకు సుదర్శన్ థియేటర్‌లో సమావేశమయ్యింది. దీనికి తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేంద్ర రెడ్డి, సుదర్శన్ థియేటర్ పార్టనర్ బాల గోవింద్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ‘అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్ల ఒపెన్‌కి కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలంగాణా ప్రభుత్వం కూడా అనుమతి ఇస్తుందని భావిస్తున్నాము. మా ఓనర్స్ అసోసియేషన్ అందరం థియేటర్స్ తెరవాలని నిర్ణయించాం’ అన్నారు. (చదవండి: 75 శాతం సినిమా టికెట్ల అమ్మకానికి ఓకే)

అంతేకాక ‘తెలంగాణా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించాలి. ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందని నమ్మతున్నాం. పార్కింగ్ రుసుము వసూలు చేసుకొనే విధంగా ప్రభుత్వం అనుమతించాలి. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ కూడా సినిమా హాళ్లు ఓపెన్ చెయ్యాలి అని చెప్పారు. వారికి మా కృతజ్ఞతలు’ అన్నారు విజయేంద్ర రెడ్డి. అనంతరం బాల గోవింద్ రాజు మాట్లాడుతూ ‘మమ్మల్ని కాపాడగలిగేది స్టేట్ గవర్నమెంట్ మాత్రమే. మాకు కొన్ని రాయితీలు ఇవ్వాలి. పార్కింగ్ విషయంలో, కరెంట్ విషయంలో ప్రభుత్వం మాకు సహకరించాలి’ అని కోరారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు