దోమకొండలో ముగ్గురు మహిళల హల్‌చల్‌ 

21 Dec, 2023 07:29 IST|Sakshi

కామారెడ్డి జిల్లా: మండల కేంద్రంలో ముగ్గురు మహిళలు బుధవారం రాత్రి హల్‌చల్‌ చేశారు. గ్రామానికి చెందిన పందిరి కాశీనాథ్‌ ఇంట్లో చొరబడి బంగారు గొలుసు, డబ్బులు దొంగిలించారంటూ కాలనీవాసులు వారిని పట్టుకుని చితకబాదారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్న పీఎస్‌కు తరలించారు. మహిళలు మద్యం తాగి, పెప్పర్‌స్రే, కట్టర్, చాకు, సుత్తి కలిగి ఉన్నారని పేర్కొన్నారు.

తమది మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామమని తన పేరు బూస కవిత అని సదరు మహిళ తెలిపారు. దోమకొండకు చెందిన కాశీనాథ్‌ తమకు గతంలో రూ.5లక్షలు అప్పు ఇచ్చాడని, తన భర్త చనిపోగా ఇల్లు అమ్మి డబ్బులు కట్టానని చెప్పారు. ప్రామిసరీ నోట్లను చించివేసిన కాశీనాథ్‌ రెండేళ్ల తర్వాత తాము ఇచ్చిన చెక్కులపై చెక్‌»ౌన్స్‌ కేసు వేశాడన్నారు.

దీంతో తాను అతడిపై వేదింపుల కేసు పెట్టానని పేర్కొన్నారు. రాజీకి వచ్చిన కాశీనాథ్‌ కేసులు విరమించుకుందామని చెప్పగా, తాను ముందు కేసు విరమించుకున్నానని, కానీ అతడు కేసు విరమించుకోలేదని చెప్పారు. కాగా సదరు మహిళలు చెబుతున్న మాటలు వాస్తవం కాదని, తనపై హత్యాయత్నానికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేయాలని కాశీనాథ్‌ పోలీసులను కోరాడు. పైఅధికారుల సూచన మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు.   

>
మరిన్ని వార్తలు