HYD: వాహనదారులకు అలర్ట్‌.. ట్రాఫిక్‌ ఆంక్షలు ఇవే..

1 Jul, 2022 13:44 IST|Sakshi
(ఫైల్‌ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ నెల 3న బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. పరేడ్‌ గ్రౌండ్‌ వద్ద శుక్రవారం భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనందర్‌ పరిశీలించారు. 

ఈ సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌లో జరగబోయే సభకు నాలుగు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటష్ట చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. సభ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. వాహనదారులు పోలీసులు సూచించిన మార్గాల్లోనే వెళ్లాలని తెలిపారు. 

ఇక, హెచ్‌ఐసీసీ పరిధిలో కూడా పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. నీరూస్‌ నుంచి కొత్తగూడ జంక్షన్‌, గచ్చిబౌలి జంక్షన్‌ వెళ్లేవారు.. సీఓడీ నుంచి దుర్గం చెరువు, బయోడైవర్సిటీ మీదుగా రాకపోకలు. ఆర్సీపురం, చందానగర్‌, మాదాపూర్‌, గచ్చిచౌలి నుంచి వచ్చే వాహనాలు బీహెచ్‌ఈఎల్‌, హెచ్‌సీయూ, ట్రిపుల్‌ ఐటీ మీదుగా వెళ్లాలి. మియాపూర్‌, కొత్తగూడ, హఫీజ్‌పేట నుంచి వచ్చేవారు ఏఐజీ ఆసుపత్రి, దుర్గం చెరువు మీదుగా రాకపోకలు సాగించాలి. 

మరిన్ని వార్తలు