గులాబ్‌ గుబులు..! సోషల్‌మీడియాలో రకరకాలుగా స్పందిస్తోన్న నెటిజన్లు..!

27 Sep, 2021 17:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను  ప్రభావంతో పాటు, ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి నీరుచేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌ మహా నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నగరప్రజల్లో గులాబ్‌ తుపాన్‌ గుబులు పుట్టిస్తుంది. సాయంత్రం నాలుగంట్ల సమయంలోనే నగరంలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఇక భారీ వర్షాల పట్ల సోషల్‌మీడియాలో నెటిజన్లు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. 

కొంత మంది నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండగా..మరికొంత మంది నెటిజన్లు భారీ వర్షాల నేపథ్యంలో ఎలక్ట్రిక్‌, జీహెచ్‌ఎమ్‌సీ, ట్రాఫిక్‌ సిబ్బంది చేస్తోన్న చర్యలను మెచ్చుకుంటున్నారు. ఏకధాటిగా కురుస్తోన్న వానను లెక్కచేయకుండా ఎలక్ట్రిక్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బంది పోల్‌ ఎక్కి కరెంట్‌ సరఫరాను మెరుగుపర్చేందుకు చేస్తోన్న కృషికి నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.

నగరంలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా.. ట్విటర్‌లో ఓ నెటిజన్‌..‘మేము అందరం మీరు చెప్పినట్లుగానే హెల్మెట్స్ పెట్టుకొని బైక్లను నడుపుతున్నాం. అసలు ఇక్కడ రోడ్‌ ఎక్కడ ఉందని ప్రభుత్వాన్ని వ్యంగ్యంగా ప్రశ్నించాడు. మరో నెటిజన్‌ నీళ్లలో బైక్‌ నడిపితే ఊహలకి.. వాస్తవానికి చాలా తేడా ఉందంటూ .. మీమ్‌ను షేర్‌ చేశాడు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చుట్టుపక్కల ఉండే మూగజీవాలను రక్షించేందుకు పలు టోల్‌ ఫ్రీ నంబర్లను షేర్‌ చేస్తున్నారు.   


 

>
మరిన్ని వార్తలు