'నన్ను మోసం చేశాడంటూ..' యువకుడి ఇంటి ముందే.. యువతి

28 Oct, 2023 09:18 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి నిరాకరించిన యువకుడి ఇంటి ఎదుట న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి ఓ యువతి ఆందోళన చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని సంజీవయ్య కాలనీకి చెందిన ప్రకాశ్‌కు ఆరు నెలల క్రితం ఆసిఫాబాద్‌ మండలం బురుగూడకు చెందిన శిరీషతో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి జరగాల్సిన క్రమంలో పలు కారణాలతో వాయిదా పడింది. తాజాగా ప్రకాశ్‌ పెళ్లికి నిరాకరించడంతో శిరీష యువకుడి ఇంటికి వచ్చింది.

దీంతో యువకుడి కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లో నుంచి బయటకు పంపించారు. దీంతో తీవ్ర చలిలోనే ప్రకాశ్‌ ఇంటి ముందు యువతి ఆందోళనకు దిగింది. సమాచారం తెలుసుకున్న పట్టణ ఎస్సై ఎంబడి శ్రీకాంత్‌ అక్కడకు చేరుకొని ఇరు పక్షాల నుంచి వివరాలు సేకరించారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని, నచ్చజెప్పే ప్రయత్నం చేసినా యువతి వినకుండా ఆందోళన కొనసాగిస్తోంది.
ఇవి చదవండి: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే..

మరిన్ని వార్తలు