ఆరోగ్యశ్రీ పథకానికి నిధులివ్వడం లేదు:  వైఎస్‌ షర్మిల 

17 Jan, 2022 01:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిధులు ఇవ్వకపోవడాన్ని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఆక్షేపించారు. ట్విట్టర్‌ వేదికగా కేసీఆర్‌ అనుసరిస్తున్న వైఖరిపై ఆమె ఆదివారం ధ్వజమెత్తారు. నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలన్న మహోన్నత ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి 2007లో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.

ఈ పథకం ద్వారా చికిత్స అందించిన ఆస్పత్రులకు రూ. 980 కోట్లకు పైగా ప్రభుత్వం బకాయిపడిందని, నిధుల కొరత కారణంగా 77.19 లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం అందని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ పథకానికి నిధులియ్యడం చేతకాని ముఖ్యమంత్రి మనకెందుకని ఆమె ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు