జయజయరామ.. జానకిరామ

28 Mar, 2023 01:44 IST|Sakshi
కోలాహలంగా సాగుతున్న రథోత్సవం
● వైభవంగా కోదండరాముని రథోత్సవం

తిరుపతి కల్చరల్‌: శ్రీకోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం ఉదయం స్వామి వారి రథోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. శ్రీసీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి రథాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాల కోలాటాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అడుగడుగునా భక్తులు కర్పూరనీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రథం నాలుగు మాడ వీధుల్లో ఊరేగి యథాస్థానానికి చేరిన తర్వాత ప్రబంధం, వేద శాత్తుమొర నిర్వహించి హారతి సమర్పించారు. మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు. రాత్రి స్వామివారి అశ్వవాహన సేవ వేడుకగా సాగింది. పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌ స్వామి, టీటీడీ సీఈ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈఓ నాగరత్నం, ఈఈలు వేణుగోపాల్‌, శివరామకృష్ణ, మురళీకృష్ణ, కృష్ణారెడ్డి, డీఈ చంద్రశేఖర్‌, ఏఈవో మోహన్‌, సూపరింటెండెంట్‌ రమేష్‌కుమార్‌, కంకణభట్టర్‌ ఆనందకుమార్‌ దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు సురేష్‌, చలపతి పాల్గొన్నారు.

నేడు చక్రస్నానం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం చక్రస్నాన ఘట్టాన్ని వేడుగా నిర్వహించనున్నారు. ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు కపిలతీర్థం పుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరగనుంది.

మరిన్ని వార్తలు