More

గాల్లో దీపాల్లా పిల్లల ప్రాణాలు

25 Aug, 2014 09:03 IST

విశాఖపట్నం: ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల నిర్లక్ష్యానికి పిల్లల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. వరుస ప్రమాదాలతో విద్యార్థులు జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నా యజమాన్యాలకు చీమకుట్టినట్టు కూడా ఉండడం లేదు. రాష్టంలో రోజూ జరుగుతున్న ప్రమాదాలే ఇందుకు నిదర్శనం.

తాజాగా విశాఖపట్నం జిల్లాలో ఓ స్కూలు బస్సు ప్రమాదానికి గురై 32 మంది చిన్నారులు గాయపడ్డారు. గొలుగొండ మండలం రావణాపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రిషి వ్యాలీ స్కూల్ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన చిన్నారులంతా 3 నుంచి12 ఏళ్లలోపు వారు. క్షతగాత్రులను గాయపడినవారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్టు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

చంద్రమోహన్‌ మృతి పట్ల సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

నంద్యాల బరి నుంచి ‘భూమా’ ఔట్‌!

మైనార్టీలను గత టీడీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది: సీఎం జగన్‌

కేబినెట్‌ కళ్లుగప్పి ఖజానాకు కన్నం 

Nov 11th : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌