More

ఎన్టీఆర్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు

1 Nov, 2013 08:53 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, రఘువీరారెడ్డి, టీజీ వెంకటేష్, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్ర విజభన నేపథ్యంలో అంధ్రప్రదేశ్ ఆవతరణ వేడుకలను తెలంగాణవాదులు అడ్డుకునే అవకాశం ఉందనే అనుమానంతో  పోలీసు ఉన్నతాధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

అందులోభాగంగా ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఇందిరా పార్క్ వైపు వచ్చే తెలుగు తల్లి ఫ్లై ఓవర్ను భద్రత చర్యల్లో భాగంగా మూసివేశారు. రాష్ట్ర మంత్రులతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే తెలంగాణ మంత్రులు మాత్రం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నారు.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

నేటి సామాజిక సాధికర బస్సుయాత్ర షెడ్యూల్‌..

‘ఇంగ్లిష్‌’లో మనమే టాప్‌!

సీఎం జగన్‌ ఆదేశాలు.. సాయం శరవేగం

పేద మహిళలకు మహిళాశక్తి ఆటోలు

అబద్ధాల బాబు.. నిజం చెప్పరుగా!