More

పోలవరం సాంకేతిక సలహాదారుపై వేటు

15 May, 2020 12:15 IST

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారు హెచ్‌కే సాహును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టుకు అవసరమైన సాంకేతిక, న్యాయ సలహాల కోసం నెలకు రూ. 2 లక్షల వేతనంతో  హెచ్‌కే సాహును ఏప్రిల్‌ 14, 2018న కన్సల్టెంట్‌గా ఏపీ ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన పనితీరు సంతృప్తికరంగా లేదని ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు సీఈ నివేదిక పంపారు. దీంతో కన్సల్టెంట్‌గా సాహును తొలగించే ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. (దేవినేని ఉమాకు మంత్రి అనిల్‌ సవాల్‌)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

సామాజిక న్యాయం సీఎం జగన్ ద్వారానే సాధ్యం

కార్పొరేట్‌ స్కూళ్ల కంటే ఏపీ ప్రభుత్వ బడులు అద్భుతం: అంబటి రాయుడు

బీసీలను చంద్రబాబు బెదిరించినప్పుడు మీరు ఎక్కడ వున్నారు?: వరుదు కళ్యాణి

చంద్రబాబుకి అసలు సర్జరీ ఎలా చేశారు?

నేడు విశాఖ, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో సాధికార యాత్ర