More

మంత్రి మృణాళిని కాన్వాయ్‌ను అడ్డుకున్న ఉద్యోగులు

11 Apr, 2015 00:05 IST

ఒంగోలు: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మృణాళిని కాన్వాయ్‌ను శుక్రవారం మధ్యాహ్నం ఒంగోలులోని చర్చి సెంటర్‌లో హౌసింగ్ బోర్డు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అడ్డుకున్నారు. నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె కలెక్టరేట్ మీదుగా కాన్వాయ్‌తో వస్తున్నట్లు తెలుసుకున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన 13 మందిని అరెస్టుచేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

నేడు విశాఖ, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో సాధికార యాత్ర 

Nov 18th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

బోగస్‌ ఇన్వాయిస్‌లతో ‘స్కిల్‌’ నిధులు స్వాహా

చంద్రబాబు కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం

బాబు కళ్లలో ఆనందం కోసమా ‘కరువు’ రాతలు?