More

మావోయిస్టుల ఆచూకీ తెలిపితే రూ.5 లక్షల నజరానా

21 Nov, 2018 09:19 IST
సీలేరులో పోలీసులు అతికించిన కరపత్రాలు

సీలేరులో పోలీసుల వాల్‌పోస్టర్లు

విశాఖపట్నం, సీలేరు(పాడేరు): ఆంధ్ర, ఒడిశా సరి హద్దు మావోయిస్టు పార్టీలో యాక్షన్‌టీం సభ్యులుగా తిరుగుతూ గిరిజన ద్రోహులైన మావోయిస్టులను ఆచూకీ తెలిపితే  రూ.5 లక్షలు నజరానా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. జీకే వీధి మండలం సీలేరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో యాక్షన్‌టీం సభ్యుల ఫొటోలతో వాల్‌పోస్టర్లు అతికించి, కరపత్రాలు పంపిణీ చేశారు. ఇందులో ఎనిమిది మంది మావోయిస్టుల ఫొటోలు ముద్రించారు. వారిని పట్టిచ్చిన వారికి రూ.5లక్షలు ఇస్తూ, వారి వివారాలు  గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

వంతాల రామకృష్ణ, జనుమూరి శ్రీనుబాబు, రాకేష్‌ ఈ ముగ్గురు డీసీఎంలు, సత్తిబాబు, కిషోర్‌ వీరిద్దరు ఏసీఎంలు, ఆండాలు, శ్రీను,మూర్తి వీరు దళాసభ్యులుగా ఉన్నారని, మన్యంలో ఎక్కడ కనిపించినా తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ, పాడేరు ఏఎస్పీ, చింతపల్లి డీఎస్పీతో పాటు, విజయనగరం, పశ్చిమగోదావరి, రంపచోడవరం తదితర పోలీసు అధికారుల ఫోన్‌ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

నేడు మాచర్లకు సీఎం జగన్‌.. వరికపుడిశెల ప్రాజెక్ట్‌కు శ్రీకారం

వెఎస్సార్‌సీపీని ఢీకొట్టడం మీ వల్ల కాదు!: హరిరామ జోగయ్య

Nov 15th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

అమల్లోకి ఏపీ భూ హక్కుల చట్టం

నేటి నుంచి సామాజిక సాధికార యాత్ర రెండో దశ