More

ఈ సారైనా ‘కూత’ పెట్టేనా?

5 Feb, 2014 03:16 IST
ఈ సారైనా ‘కూత’ పెట్టేనా?

  నత్తనడకన కడప-మదనపల్లె వయా బెంగళూరు రైలు మార్గం పనులు
     ప్రతి బడ్జెట్‌లోనూ అరకొర నిధులే
     గత ఏడాది అదీ లేదు
     ఈ సారి ఏమవుతుందో..ఏమో!
 
 కడప-మదనపల్లె వయా బెంగళూరు రైలుమార్గంపైనే పడమటి మండలాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ నెలలో ప్రవేశపెట్టనున్న 2014-15 రైల్వే బడ్జెట్‌లోనైనా పాలకులు ప్రత్యేక చొరవ చూపుతారేమోనని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.
 
 మదనపల్లె సిటీ, న్యూస్‌లైన్ :
 కడప-మదనపల్లె వయా బెంగళూరు రైలుమార్గంపైనే పడమటి మండలాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ నెలలో ప్రవేశపెట్టనున్న 2014-15 రైల్వే బడ్జెట్‌లోనైనా పాలకులు ప్రత్యేక చొరవచూపుతారేమోనని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.
 కడప నుంచి లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, మదనపల్లె, పుంగనూరు, రామసముద్రం మీదుగా బెంగళూరుకు రైలుమార్గం ఏర్పాటు చేసేందుకు ఐదేళ్ల క్రితం రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది.  2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి రెండు రాష్ట్రాల ప్రయాణికుల సమస్యలను దృష్టిలో ఉంచుకని సర్వే పనులు చేపట్టారు. 350కిలో మీటర్ల దూరం ఉన్న ఈ మార్గంలో రైలు నడిపితే కడప, బెంగళూరు మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయని భావించారు. ఈ మేరకు రూ.1080 కోట్ల అంచనాతో శంకుస్థాపన చేశారు. ఆయన మరణానంతరం దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికొదిలేశాయి. 2010లో రూ.40 కోట్లు, 2011లో రూ.56 కోట్లు, 2012లో రూ.60 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. 2013లో మొండి చెయ్యి చూపారు. మంజూరైన నిధులు ఈ మార్గంలోని రాళ్లు, చెట్లను తొలగించేందుకు సరిపోయాయి. సర్వే పనులు వైఎస్సార్ కడప జిల్లా పెండ్లిమర్రి వరకు చేపట్టి మిన్నకుండి పోయారు. పాలకులు ఈ సారి బడ్జెట్‌లోనైనా పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయిస్తారో లేదోనని పడమటి మండలాల ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అట్టర్‌ప్లాప్‌ అయినా ఫర్వాలేదనుకుంటున్న పవన్‌!

CM Jagan: 15న మాచర్లకు సీఎం జగన్‌

ఒక బైక్‌పై ఓవర్‌స్పీడ్‌లో నలుగురు.. ముగ్గురి మృతి

ఎన్నికల నాటికి 'తణుకు' ఎన్ని మలుపులు తిరుగుతుందో..? ఏ ముగింపునిస్తుందో..?

Nov 13th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌