More

ఆయిల్ కార్పొరేషన్ ట్యాంకర్ బోల్తా

17 Feb, 2015 00:19 IST

విశాఖపట్టణం: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)కు చెందిన గ్యాస్ ట్యాంకర్ గాజువాక సమీపంలో జాతీయరహదారిపై బోల్తా పడింది. సోమవారం తెల్లవారుజామున నాపయ్యపాలెం వద్ద ఈ సంఘటన జరిగింది. నాపయ్యపాలెంలో ట్రాన్స్‌పోర్టు ఆఫీస్ ముందు ఆగి ఉన్న లారీని ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో పూల్ గ్యాస్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడింది. విషయం తెలిసిన ఐఓసీ అగ్నిమాపక సిబ్బంది, జాతీయ రహదారుల భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ట్యాంకర్‌ను పరిశీలించారు. రోడ్డుపై అడ్డంగా పడటంతో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. హైవే పెట్రోలింగ్ పోలీసులు వాహనాన్ని రోడ్డుపై నుంచి తరలించారు. గ్యాస్ లారీ కావడంతో చుట్టుపక్కల ప్రజలు భయపడ్డారు. కాగా, ఈ ప్రమాదానికి కారణం ట్యాంకర్ డ్రైవర్ మద్యమత్తులో వాహనం నడపడమేనని పోలీసుల సమాచారం.
(గాజువాక)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

విజయనగరం జిల్లా: టీ కాస్తుండగా పేలిన గ్యాస్‌ సిలిండర్‌

దేశంలోనే నంబర్‌ 1 మెరైన్‌ స్టేట్‌ ‘ఏపీ’

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Nov 19th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

డిసెంబర్‌ 28 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం