More

సీఎం జగన్‌ నిర్ణయంతో వేంపెంటలో ఆనందాలు

30 Jun, 2019 20:57 IST

సాక్షి, కర్నూలు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంతో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలంలోని వేంపెంట గ్రామంలో ఆనందాలు వెల్లివిరిశాయి. గ్రామస్తులను కొన్నేళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్న పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టును ఆయన రద్దు చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సందర్భంగా వేంపెంట గ్రామప్రజలకు ‘‘అధికారంలోకి వచ్చేదాకా స్టే తెచ్చుకుందాం. అధికారంలోకి రాగానే ప్రాజెక్టును క్యాన్సెల్ చేస్తా’’ అని ఆ రోజు మాటిచ్చారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టును రద్దు చేసి వేంపేట ప్రజలపై తన ప్రేమను చాటుకున్నారు. దీంతో ఎనిమిదేళ్ల పోరాటం.. ఐదేళ్ల సుదీర్ఘ రిలే నిరాహార దీక్షల తర్వాత గ్రామస్తులు విజయం సాధించినట్లైంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘సంక్షేమ రాజ్యం సృష్టికర్త సీఎం జగన్’

ఏపీ: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు జీవో జారీ

మౌలానా ఆజాద్ జ‌యంతి వేడుకలకు సీఎం జగన్‌

‘ఏపీలో సామాజిక విప్లవం.. ఆ ఘనత సీఎం జగన్‌దే’

రాజ్‌భవన్‌కు పదే పదే! అలా ప్లాష్‌బ్యాక్‌లోకి వెళితే..