More

బాబు ప్రభుత్వం ఇసుక మాఫియాగా తయారైంది

30 Nov, 2014 12:51 IST
బాబు ప్రభుత్వం ఇసుక మాఫియాగా తయారైంది

కాకినాడ: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఇసుక మాఫియాగా తయారైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి ఆరోపించారు. బాబు ప్రభుత్వంలోని మంత్రులు, నేతలు జిల్లాల్లోని రిచ్లోని ఇసుకును బ్లాక్ మార్కెట్లో 10 ట్రక్కుల చొప్పున అనధికారికంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు.  ఆదివారం నగరంలోని స్థానిక సినిమా రోడ్డులోని సూర్యకళామందిరంలో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆ పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజులతోపాటు జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు, ఆయన మంత్రి వర్గంలోని మంత్రుల వ్యవహరంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లులో చేసిన హామీలను అమలు చేసుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఎద్దేవా చేశారు.  మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ధాన్యం మద్దతు ధర కింటాల్కు రూ.1000 చేశారు. చంద్రబాబు సర్కార్ రూ. 50 కూడా పెంచే సదుపాయం చేయలేదని గుర్తు చేశారు. 

వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒకరిద్దరు వైఎస్ఆర్ సీపీ పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎటువంటి నష్టం వాటిల్లదన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు డిసెంబర్ 8 నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర చేపటనున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆ రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ వర్కింగ్ ప్రెసిండెంట్ పొంగులేటి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర సాగుతుందని విజయసాయిరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

నేడు సీఎం జగన్‌ విజయవాడ పర్యటన

కేబినెట్‌ కళ్లుగప్పి ఖజానాకు కన్నం 

Nov 11th : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

మెడ్‌టెక్‌ జోన్‌లో మెగా ఎక్స్‌పో సిటీ

పరిశ్రమల భూకేటాయింపులు మరింత సరళం