More

జస్టిస్‌ జయచంద్రారెడ్డి మృతిపై సీఎం జగన్‌ దిగ్ర్భాంతి

10 Feb, 2020 15:21 IST

సాక్షి, తాడేపల్లి : సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కామిరెడ్డి జయచంద్రారెడ్డి మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. లా కమిషన్‌ చైర్మన్‌గా, ప్రెస్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌గా భారత న్యాయవ్యవస్థకు ఆయన చేసిన కృషి మరువలేనిదని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

పదవీ విరమణ అనంతరం బెంగళూరులో ఉంటున్న జస్టిస్‌ జయచంద్రారెడ్డి ఆదివారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన కుమారుడు చనిపోవడంతో కోడలు, మనవళ్లతో బెంగళూరులో విశ్రాంత జీవితం గడుపుతున్న జస్టిస్‌ జయచంద్రారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

చదవండి : కుగ్రామం నుంచి సుప్రీం స్థాయికి..

జస్టిస్‌ జయచంద్రారెడ్డి కన్నుమూత

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఆడుకుందాం రండి!

లేని బ్రాండ్లకు ధరల పెంపా!?

రామోజీ శోకం రుషి‘కొండంత’!

మత్స్య రంగంలో ఏపీ అద్భుత ప్రగతి

విభజన చట్టంలోని అంశాలను త్వరగా అమలు చేయండి