More

జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌

16 Aug, 2017 03:55 IST




నంద్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నంద్యాలలో అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నంద్యాలలోని బొమ్మల సత్రంలో తాను విడిది చేసిన గృహానికి ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జగన్‌ ఉప ఎన్నికల ప్రచారానికి బయలుదేరడానికి ముందుగా జాతీయ జెండాను ఎగుర వేశారు.

ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన అక్కడి నుంచి ప్రచారానికి బయల్దేరి వెళ్లారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసనసభలో పార్టీ ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ముఖ్య నేతలు కోలగట్ల వీరభద్రస్వామి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కె.పి.సారథి, నంద్యాల ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.







 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

హైకోర్టు తీర్పును రద్దు చేయండి

మత్స్యకారులను ఆదుకుంటున్నాం.. 'అండగా ఉన్నాం'

ఫైబర్‌నెట్‌ కేసులో కీలక పరిణామం

13వ షెడ్యూల్‌పై ముగిసిన సమీక్షా సమావేశం

బాబు బెయిల్‌ తీర్పులో ఏముంది?.. కొన్ని సందేహాలు.. అనుమానాలు!