More

2జీ, 3జీ మొబైల్‌ బిజినెస్‌కు ఆర్‌కామ్‌ గుడ్‌ బై!!

26 Oct, 2017 00:21 IST

న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికం కంపెనీ ‘రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌’ నవంబర్‌ 30 నాటికి తన నష్టాల్లోని వైర్‌లెస్‌ టెలిఫోన్‌ బిజినెస్‌(2జీ, 3జీ)ను నిలిపివేయనుంది. ఇక సంస్థ కేవలం 4జీ సేవలపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించనుంది. ‘వైర్‌లెస్‌ బిజినెస్‌కు ముగింపు పలకాల్సిన రోజు వచ్చింది. వచ్చే 30 రోజుల్లో వైర్‌లెస్‌ బిజినెస్‌ను మూసివేస్తాం’ అని ఆర్‌కామ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గుర్దీప్‌ సింగ్‌ తాజాగా ఉద్యోగులకు చెప్పారు.

ఇంటర్నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ (ఐఎల్‌డీ) వాయిస్, కన్సూమర్‌ వాయిస్, 4జీ డాంగిల్‌ పోస్ట్‌ పెయిడ్‌ సర్వీసెస్, మొబైల్‌ టవర్‌ వ్యాపారాలను లాభదాయకంగా ఉన్నంత వరకూ కొనసాగిస్తామని తెలియజేశారు. కాగా వైర్‌లెస్‌ టెలిఫోన్‌ బిజినెస్‌ మూసివేతకు సంబంధించి ఆర్‌కామ్‌కు వివిధ వార్తాసంస్థల నుంచి మెయిల్‌ పంపినా సమాధానం రానట్లు అవి తెలియజేశాయి. నవంబర్‌ 21న లైసెన్స్‌ గడువు ముగిశాక డీటీహెచ్‌ బిజినెస్‌ను కూడా ఆపివేస్తామని సింగ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

సొంత కంపెనీల్లోనే ఉద్యోగాలు కోల్పోయిన సీఈవోలు వీరే!

ఎల్‌ అండ్‌ టీ కంపెనీపై రూ.239 కోట్లు పెనాల్టీ.. కారణం ఇదేనా..

సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

ఓపెన్ఏఐ వద్దంటే.. మైక్రోసాఫ్ట్ రమ్మంది!

Raymond: రూ.8 వేల కోట్లు ఇస్తే భర్తతో విడిపోయేందుకు సిద్ధం