భారత ఐటీ గ్రాడ్యుయేట్స్‌కు శుభవార్త

Published on Mon, 02/10/2020 - 19:06

సాక్షి, బెంగళూరు:  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేజర్ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్ప్  భారత ఐటీ గ్రాడ్యుయేట్స్‌కు శుభవార్త అందించింది. సంవత్సరం భారతదేశంలో ఎక్కువ మందిని టెకీలను నియమించుకోనున్నట్టువెల్లడించింది.  ఎందుకంటే విద్యార్థులు డిజిటల్ నైపుణ్యాలలో మెరికల్లా  యూనివర్శిటీల నుంచి విద్యార్థులు ఎక్కువ వస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే 2020లో ఇంజనీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్ల నియామకంలో 30 శాతం పెంచాలని నిర్ణయించాలని తెలిపింది. 2019 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 10-12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన కాగ్నిజెంట్  భారతదేశంలో నియామకాలను పెంచడం విశేషం. 

భారతదేశంలోని ప్రధాన ఇంజనీరంగ్‌ కాలేజీలనుంచి 20వేల మందికి పైగా అభ్యర్థులను నియమించుకోవాలని యోచిస్తున్నామని కాగ్నిజెంట్ సీఈవో  బ్రియాన్ హంఫ్రీస్ చెప్పారు. అంతేకాదు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు జీతాలను 18శాతం పెంచి, రూ. 4 లక్షలను ఆఫర్‌ చేయనుంది. దాదాపు 100 ప్రీమియర్ ఇంజనీరింగ్ క్యాంపస్‌ల నుంచి తమ సంస్థలో చేరుతున్న వారి శాతం  80 శాతానికి పైమాటేనని,  కాగ్నిజెంట్ పై పెరిగిన విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తుందని హంఫ్రీస్  పేర్కొన్నారు. కాగా గత ఏడాది, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తరువాత భారతదేశంలో 2 లక్షల మంది ఉద్యోగులతో రెండవ ఐటీ కంపెనీగా కాగ్నిజెంట్ నిలిచింది. మొత్తం 4.4 లక్షల మంది ఉద్యోగులతో భారతదేశపు అతిపెద్ద  ఐటీ కంపెనీగా టీసీఎస్ ఉన్నసంగతి తెలిసిందే. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ