More

నిజాయితీయే మా విజయ రహస్యం: అమెజాన్‌

21 May, 2020 21:52 IST

ముంబై: కరోనా దెబ్బకు ఈ కామర్స్‌ కంపెనీలు భారీగా కుదేలయ్యాయి. నష్టాలను పూడ్చుకునేందుకు ఈకామర్స్‌ కంపెనీలు అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. వినియోగిదారులను ఆకర్శించేందుకు టెక్నాలజీని సమర్థవంతంగా ఊపయోగిస్తామని అమెజాన్ ఇండియా పేర్కొంది. వినియోగదారులను ఆన్‌లైన్‌ సేవలకు మొగ్గు చూపే విధంగా ఈకామర్స్‌ కంపెనీలు కృషి చేస్తున్నాయి. నిజాయితిగా వినియోగదారులకు సేవలందించే కంపెనీలకు ఎప్పటికి భవిష్యత్తు ఉంటుందని అమెజాన్‌ కంపెనీ ప్రతినిథులు తెలిపారు. నిజాయితియే తమ విజయ రహస్యమని అమెజాన్ కంపెనీ ప్రకటించింది. 

కరోనా తగ్గుదల తర్వాత వినియోగదారులు రక్షణాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉందని.. కంపెనీలు మెరుగైన సేవలు అందించేందుకు తీవ్రంగా కృషి చేయాలని అమెజాన్‌ ఇండియా ముఖ్య ప్రతినిథి అమిత్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.  రానున్న కాలంలో సాంకేతికత, నూతన ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

2030 నాటికి అగ్రగామిగా భారత్ - ఇలా..

చిరిగిన నోట్లలో తేడాలు.. ప్రభుత్వ బ్యాంక్‌కు భారీ ఫైన్‌!

...అలా విజయం సాధించినట్లు చరిత్రలో లేదు: ఉద్యోగులకు సీఈవో ఉద్బోధ

ఆస్తులు అమ్మేస్తున్న శ్రీదేవి భర్త!

బరువెక్కిన బంగారం.. స్వల్పంగా తగ్గిన వెండి - నేటి కొత్త ధరలు ఇలా..