More

హెచ్డీఎఫ్సీ లాభాలు జూమ్

27 Oct, 2016 01:42 IST
హెచ్డీఎఫ్సీ లాభాలు జూమ్

క్యూ2లో 1,827 కోట్లు... 14% వృద్ధి
ముంబై: రుణాల్లో చక్కని వృద్ధితో హెచ్‌డీఎఫ్‌సీ సెప్టెంబర్ త్రైమాసికంలో అంచనాలకు తగ్గ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర ఆదాయం 16 శాతం వృద్ధితో రూ.2,446 కోట్లుగా నమోదైంది.  స్టాండలోన్ లాభం 14 శాతం వృద్ధితో రూ.1,827 కోట్లుగా ఉంది. రుణాల జారీలో 20 శాతం వృద్ధి, కంపెనీ నిర్వహణలోని ఆస్తుల్లో 17 శాతం వృద్ధి చెందడం, రుణాలపై మార్జిన్ (స్ప్రెడ్స్) స్వల్ప పెరుగుదలతో ఈ త్రైమాసికంలో అధిక లాభాలను ఆర్జించినట్టు హెచ్‌డీఎఫ్‌సీ వైస్ చైర్మన్ కేకి మిస్త్రీ ఫలితాల వెల్లడి సందర్భంగా తెలిపారు.

నికర వడ్డీ మార్జిన్ 3.9 శాతంగా నమోదైంది.

స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 0.75 శాతం నుంచి 0.76 శాతానికి చేరాయి.

రిటైల్ రుణాల్లో 25% వృద్ధి నమోదైంది.

రూ.1,939 కోట్ల రుణాలను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు విక్రయించింది.

సెప్టెంబర్ నాటికి కంపెనీ నిర్వహణలో ఉన్న ఆస్తులు రూ.3,11,264 కోట్లకు చేరాయి.

జూన్ త్రైమాసికంలో ఎన్‌పీఏలకు కేటాయింపులు రూ.340 కోట్లు ఉండగా... సెప్టెంబర్ త్రైమాసికంలో అవి రూ.95 కోట్లకు తగ్గాయి.

లోగడ హెచ్‌డీఎఫ్‌సీ మసాలా బాండ్ల జారీ ద్వారా రూ.5వేల కోట్లను సమీకరించగా... మరో ఈ బాండ్ల జారీతో రూ.5వేల కోట్లను సమీకరించాలని అనుకుంటున్నట్టు మిస్త్రీ తెలిపారు. ఇందుకోసం అనుమతి కోరుతూ ఆర్‌బీఐకి లేఖ రాయనున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Patanjali: అది నిరూపిస్తే చావడానికైనా సిద్ధమే: బాబా రామ్‌దేవ్

Air India: టాటా గ్రూప్‌ సంస్థపై భారీ పెనాల్టీ.. కారణం ఇదేనా..

Tesla Cars: ఇండియాలో ఇక టెస్లా కార్లు.. ధర ఎంతంటే..?

రూ.750 కోట్లు జీఎస్టీ బకాయి.. జొమాటో, స్విగ్గీలకు నోటీసులు

పక్షి కన్ను చూస్తున్న అర్జునుడి పాత్రలో ఆర్‌బీఐ: దాస్‌