More

ప్రపంచ ఆర్థిక రిస్క్ లు పెరిగాయ్

14 Apr, 2016 01:03 IST
ప్రపంచ ఆర్థిక రిస్క్ లు పెరిగాయ్

ఐఎంఎఫ్ నివేదిక హెచ్చరిక
సమగ్ర, పటిష్ట, సమన్వయ  విధాన చర్యలకు సూచన

 వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక రిస్క్‌లు పెరిగాయని, దీనిని ఎదుర్కొనడానికి అన్ని దేశాలూ సమన్వయంగా పటిష్ట విధాన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. ఈ మేరకు తాజా ప్రపంచ ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం...

కమోడిటీ ధరల పతనం, చైనా మందగమనం వంటివి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

అనిశ్చితిని సమన్వయంతో ఎదుర్కొనలేకపోతే.. వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. రానున్న ఐదేళ్లలో ఒక ఏడాదికి సమానమైన వృద్ధి హరించుకుపోయే ప్రమాదం ఉంది.

అయితే సమన్వయంగా పరిస్థితిని ఎదుర్కొనగలిగితే... 2% అదనపు వృద్ధీ సాధ్యమవుతుంది.

ఈక్విటీల్లో తీవ్ర ఒడిదుడుకులకు విశ్వాసం పటిష్టంగా లేకపోవడమే ఒక కారణం.

వృద్ధి విషయంలో ద్రవ్య పరమైన విధానాలకు కీలకం అయినప్పటికీ, కేవలం వీటిద్వారానే సమస్య పరిష్కారం అయిపోతుందని భావించరాదు.  వృద్ధికి దోహదపడే పటిష్ట సంస్కరణలు, తగిన సమన్వయ ద్రవ్య విధానాలు అవసరం. ఆయా అంశాల వల్ల ప్రతికూలతలను తట్టుకుని నిలబడేలా చేస్తుంది.

అంతర్జాతీయ స్థాయిలో ఫైనాన్షియల్ రెగ్యులేటరీ సంస్కరణల ఎజెండా పూర్తికావాలి.

కమోడిటీ ధరల తగ్గుదల, పలు దేశాల్లో ద్రవ్యపరమైన ఇబ్బందులు ప్రపంచ వృద్ధి అంచనాలను  బలహీనంగా మార్చుతున్నాయి.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

జియోఫోన్‌ ప్రైమా సేల్స్ షురూ - ధర రూ.2,599 మాత్రమే!

సెజ్‌ నిబంధనల సరళతరంపై దృష్టి - పియుష్‌ గోయల్‌

వచ్చేవారంలోగా రిఫండ్స్‌ జరగాలి

ఆర్థిక వృద్ధిలో భారత్‌ ఎకానమీ ట్రాక్‌ రికార్స్ - ఎస్‌అండ్‌పీ రిపోర్ట్

యాంఫీ కొత్త సీఈవోగా వెంకటనాగేశ్వర్‌ చలసాని