More

స్కువ సర్వీసెస్లో క్రెడిట్సేఫ్ పెట్టుబడులు

1 Jul, 2016 01:01 IST
స్కువ సర్వీసెస్లో క్రెడిట్సేఫ్ పెట్టుబడులు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిజినెస్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న నార్వే సంస్థ క్రెడిట్‌సేఫ్... హైదరాబాద్‌కు చెందిన స్కువ సర్వీసెస్‌లో పెట్టుబడులు పెట్టింది. అయితే ఎంత మొత్తం పెట్టుబడి పెట్టిందనేది కంపెనీ వెల్లడించలేదు. క్రెడిట్‌సేఫ్‌కు ఐటీ డెవలప్‌మెంట్ సేవలందిస్తామని స్కువ సర్వీసెస్ ఫౌండర్ కిషోర్ కంచర్ల గురువారమిక్కడ విలేకరులతో చెప్పారు. ఈ కంపెనీలో తమకు 75% వాటా ఉందని క్రెడిట్‌సేఫ్ చీఫ్ టెక్నాలజీ, కంటెంట్ ఆఫీసర్ ఆంగస్ గోవ్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా 90 వేలకుపైగా కంపెనీలకు సేవలందిస్తున్నట్టు వెల్లడించారు. 2015లో వివిధ కంపెనీలకు చెందిన 10 కోట్లకుపైగా క్రెడిట్ రిపోర్టులను క్లయింట్లకు సరఫరా చేశామని చెప్పారాయన. కంపెనీల వ్యాపారం తీరుతెన్నులు, డెరైక్టర్లు, పెట్టుబడులు, ఆస్తులు, అప్పులు తదితర అంశాలను క్రెడిట్‌సేఫ్ సేకరించి నిక్షిప్తం చేస్తుంది. ఈ సమాచారాన్ని కోరిన క్లయింట్లకు అందిస్తుంది. ప్రస్తుతం భారత్‌లో ఈ సమాచారాన్ని కంపెనీ సేకరిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

సీఈఓను తొలగించిన వెంటనే.. ప్రెసిడెంట్ రాజీనామా - ట్వీట్ వైరల్

మస్క్‌‌ చేసిన పనికి మండిపడ్డ అమెరికా.. గుణపాఠం చెప్పిన దిగ్గజ కంపెనీలు!

స్థిరంగా బంగారం.. రూ.500 తగ్గిన వెండి - కొత్త ధరలు ఇలా!

యూపీఐ ఐడీలు డీయాక్టివేట్ అవుతాయ్ - చెక్ చేసుకోండి!

ఓపెన్‌ఏఐ కొత్త సీఈఓ.. ఎవరీ 'మీరా మురాటి'?