More

అద్భుత ఫీచర్లతో తొలి రెడ్‌మి స్మార్ట్‌టీవీ

19 Aug, 2019 14:44 IST

70 అంగుళాల డిస్‌ప్లేతో రెడ్‌మి ఫస్ట్‌ టీవీ

చైనాలో ఆగస్టు 29 న ఆవిష్కరణ

రెడ్‌మి నోట్ 8, రెడ్‌మి 8, రెడ్‌మి 8 ఎ

బీజింగ్ : చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి అనుబంధ సంస్థ రెడ్‌మి ఇకపై స్మార్ట్‌టీవీలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు  షావోమి వ్యవస్థాపకుడు, ఛైర్మన్  సీఈవో లీ జున్ ధృవీకరించారని  చైనా న్యూస్‌పోర్టల్‌  సోమవారం తెలిపింది.

70 అంగుళాల భారీ స్క్రీన్‌తో మొట్టమొదటి రెడ్‌మి టీవీని ఆగస్టు 29న చైనాలో ప్రారంభించనుంది. రెడ్‌మి టీవీ (మోడల్ నంబర్ ఎల్70ఎం 5) ఇటీవల చైనాలో తన 3 సి సర్టిఫికేషన్‌ ఆమోదించింది. ఆండ్రాయిడ్ టీవీ  ఓఎస్ ఆధారిత ప్యాచ్‌వాల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను నడుపుతుంది.  ఫీచర్లువిషయానికి వస్తే  4కే టీవీలో హెచ్‌డిఆర్ సపోర్ట్, డాల్బీ , డిటిఎస్ ఆడియో,  బ్లూటూత్ వాయిస్ రిమోట్‌ తదితర ఫీచర్లు జోడించింది.  ఈ స్మార్ట్‌టీవీ లాంచింగ్‌తోపాటు,  8వ జనరేషన్‌కు చెందిన రెడ్‌మి నోట్ 8, రెడ్‌మి 8, రెడ్‌మి 8 ఎ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.13.70 లక్షల కోట్లు

అనుకున్నది సాధించడమంటే ఇదే.. వీడియో వైరల్

ఫెరారి నుంచి మరో సూపర్ కారు - లాంచ్ ఎప్పుడంటే?

ప్రభుత్వ ‘యూకో’ బ్యాంక్‌ బాగోతం.. ప్రశ్నార్ధకంగా 114 కోట్లు!

ఒక్కప్లాన్‌తో 14 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు.. జియో టీవీ బంప‌ర్ ఆఫ‌ర్