More

రూపాయికే స్పైస్‌జెట్ టికెట్!

14 Jul, 2015 23:50 IST
రూపాయికే స్పైస్‌జెట్ టికెట్!

హైదరాబాద్ : ఒక్క రూపాయి ఎయిర్ ఫేర్ ఆఫర్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చామని స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్‌లో భాగంగా లక్షకు పైగా వన్-వే టికెట్లను ఒక్క రూపాయికే(పన్నులు, ఫీజులు అదనం) ఆఫర్ చేస్తున్నామని స్పైస్‌జెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ పేర్కొన్నారు. రౌండ్ ట్రిప్ విమాన టికెట్ల కొనుగోలుకు, ఒక వైపు రెగ్యులర్ చార్జీల కింద టికెట్లు కొనుగోలు చేసిన వారికి, ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. ఎంపిక చేసిన దేశీయ రూట్లలో నాన్ స్టాప్ విమాన సర్వీసులకే ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు.

తమ కొత్త మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసే టికెట్లకే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు.  నేటి (బుధవారం)నుంచి ప్రారంభమయ్యే ఈ ఆఫర్ శుక్రవారం అర్ధరాత్రి వరకూ అందుబాటులో ఉంటుందని,  నేటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ప్రయాణాలకు వర్తిస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌, ఉచితంగా మ్యాచ్‌ టికెట్లు!

అలెర్ట్‌, దేశ వ్యాప్తంగా ఉద్యోగుల సమ్మె.. బ్యాంక్‌ సేవలపై ఎఫెక్ట్‌!

డొక్కు స్కూటర్‌పై సుబ్రతా రాయ్‌ జీవితం ఎలా మొదలైంది? చివరికి అనాధలా

కెమెరాల్లో రీళ్లు వేసుకుని, ఫొటోలు తీసేలా ఫిల్మ్‌రోల్‌

మనవడు, మనవరాలి పుట్టినరోజు వేడుకలో అంబానీ దంపతులు