More

సీబీఐ ఆఫీసర్‌నంటూ లక్షలు కాజేశాడు

22 Nov, 2019 20:14 IST

సాక్షి, బెంగళూరు : సీబీఐ ఆఫీసర్‌నంటూ వ్యక్తులను భయపెట్టి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ ఇచ్చిన వివరాల ప్రకారం.. అభిలాష్‌ (34) అనే వ్యక్తి సీబీఐ ఆఫీసర్‌గా చలామణి అవుతూ తప్పుడు కేసులు పెడతానంటూ బెదిరించి ఇటీవల ఓ వ్యక్తి దగ్గర రూ. 24 లక్షలు కాజేశాడు. ఆ తర్వాత కూడా పలువురిని మోసం చేయడానికి ట్రాక్‌లో పెట్టాడు. సమాచారమందుకున్న పోలీసులు అభిలాష్‌ని పట్టుకొని అతని వద్దనున్న రెండు బెంజ్‌కార్లను స్వాదీనం చేసుకున్నారు. నిందితుని సోషల్‌ మీడియాలోని ఖాతాలు చూడగా, అందులో తను ఇంజనీర్‌, బిజినెస్‌మేన్‌ అని ఉంది. కాగా, అభిలాష్‌ మీద ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

సంబంధిత ఫోటోలు
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

విశాఖలో స్కూల్‌ ఆటోను ఢీకొన్న లారీ.. ఇద్దరి చిన్నారుల పరిస్థితి విషమం

ఫొటో జర్నలిస్ట్‌ గోపాల్‌పై దాడి

Nov 22nd: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

ఈ–చలానా కేసులో ప్రధాన నిందితుడు కొమ్మారెడ్డి అవినాష్‌ అరెస్టు 

ఎన్‌ఆర్‌ఐ ఇల్లు కబ్జాకు యత్నం.. నటి స్వాతి దీక్షిత్‌పై కేసు