More

నెల్లూరులో కారు బీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు

8 Dec, 2018 13:36 IST

సాక్షి, నెల్లూరు : నగరంలో  ఓ కారు బీభత్సం సృష్టించింది. పెట్రోల్‌ బంకులోనుంచి వేగంగా వచ్చిన కారు జనంపైకి దూసుకెళ్లటంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం నెల్లూరు నగరంలోని బొల్లినేని ఆసుపత్రి సమీపంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. ఈ ఉదయం బొల్లినేని ఆసుపత్రి సమీపంలోని పెట్రోల్‌ బంకులోంచి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు పదిమంది వ్యక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి.

కారు అంతటితో ఆగకుండా అక్కడి ఆటోలపైకి, బైకులపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. సంఘటన జరిగిన సమయంలో జనం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. కారు వేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.    

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వికారాబాద్‌: అవ్వ మిస్సింగ్‌, చివరకు..

అందుకే నాంపల్లి ప్రమాదం జరిగింది: అగ్నిమాపక శాఖ

ఒక బైక్‌పై ఓవర్‌స్పీడ్‌లో నలుగురు.. ముగ్గురి మృతి

Nov 13th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

వైన్‌ షాప్‌నకు నిప్పు.. మద్యం ఇవ్వలేదని తగలబెట్టేశాడు!