More

మూఢనమ్మకాలతో కవలలకు వాతలు

10 May, 2019 16:59 IST

విజయనగరం: పాచిపెంట మండలం కేసలి పంచాయతీ ఊబిగుడ్డిలో దారుణం చోటుచేసుకుంది. మూఢ నమ్మకాలతో అప్పుడే పుట్టిన కవల పిల్లలకు గిరిజనులు వాతలు పెట్టారు. పరిస్థితి విషమించడంతో సాలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు అనారోగ్యంతో కవలల తల్లి చికిత్స పొందుతూ శుక్రవారమే మృతిచెందడం ఆ కుటుంబంలో మరింత విషాదం నింపింది. 

విద్యుత్‌ స్థంభాన్ని ఢీకొన్న కారు..ఇద్దరికి గాయాలు
లక్కవరపు కోటమ గ్రామ శివారు వద్ద విశాఖపట్నం నుంచి అరకు వైపు వెళ్తున్న డస్టర్‌ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్‌ స్థంభాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న ఇద్దరు నేవీ ఉద్యోగులకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ కారులో సేప్టీ బెలూన్లు తెరుచుకోవడంతో చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. కారు వేగానికి విద్యుత్‌ స్థంభాలు కూడా విరిగిపోయాయి.

షార్ట్‌ సర్క్యూట్‌తో 4 ఇళ్లు దగ్ధం

జామి మండలంల లోట్లపల్లి గ్రామంలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా 4 ఇళ్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.6 లక్షల ఆస్తినష్టం సంభవించింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వీడియో కాల్‌లో డబ్బులు అడుగుతున్నారా?.. ఇది తెలుసుకోండి..

అర్ధరాత్రి ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు గాయాలు!

Nov 12th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Land-for-jobs case: ‘ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌’ కుంభకోణం.. లాలూ సన్నిహితుడి అరెస్ట్‌

ఆరుగురు అలీగఢ్‌ వర్సిటీ విద్యార్థుల అరెస్ట్‌