తగ్గుతున్న పిల్లల దత్తత!

Published on Mon, 12/28/2015 - 02:23

♦ శిశువుల అక్రమ అమ్మకాలే ప్రధాన కారణం
♦ రోజు రోజుకు పెరుగుతున్న దరఖాస్తులు
♦ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వద్ద 12 వేల అప్లికేషన్స్
 
 సాక్షి, హైదరాబాద్: అనాథ పిల్లల్ని కేంద్రానికి అప్పగించే వారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. దీంతో ప్రభుత్వం దగ్గరికి చేరే అనాథపిల్లల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దేశవ్యాప్తంగా 2010లో కేంద్రం అన్ని రాష్ట్రాల్లో దాదాపు 6,321 మంది అనాథపిల్లలను దత్తతకు ఇచ్చింది. గతేడాది ఆ సంఖ్య 4,362కు పడిపోయింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 1,720 మంది పిల్లలను మాత్రమే దత్తతకు ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రులు, నిర్మానుష్య ప్రదేశాల్లో శిశువులను వదిలిపోతున్న సంఘటనల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే శిశువుల అక్రమ అమ్మకాల వల్లే ప్రభుత్వానికి చేరే అనాథపిల్లల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణమని అధికారులు పేర్కొంటున్నారు.

 తెలంగాణలో ఇదీ పరిస్థితి..
 ప్రస్తుతం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 235 మంది అనాథ పిల్లలున్నారు. మన రాష్ట్రం నుంచి దత్తత తీసుకునేందుకు 888 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది 225 మంది పిల్లలను దత్తతకు ఇచ్చారు. ఈ సంఖ్య గతంతో పోలిస్తే కాస్త పెరిగింది. అయితే శిశు గృహాలకు చేరే శిశువుల సంఖ్య మాత్రం తగ్గుతోందని అధికారులు వాపోతున్నారు. కాగా, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా)కు అన్ని రాష్ట్రాల నుంచి 12 వేలకు పైగా దత్తత దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ దరఖాస్తులకు తగ్గట్లు శిశు గృహాల్లో అనాథ పిల్లలు లేరు. పిల్లలు ఏ శిశు గృహంలో అందుబాటులో ఉన్నా దేశవ్యాప్తంగా ఎవరైనా ఆన్‌లైన్‌లో కానీ నేరుగా కానీ దరఖాస్తు చేసుకునేలా ఈ ఏడాది ఆగస్టులో అవకాశం కల్పించారు. దీంతో దరఖాస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)