More

కేసుల మాఫీ కోసమేనా చండీయాగం ?

29 Oct, 2015 10:30 IST
కేసుల మాఫీ కోసమేనా చండీయాగం ?

నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కలియుగం నుంచి ద్వాపర, త్రేతాయుగాలకు తీసుకెళ్తున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మొన్నటిదాకా ఉత్సవాలు, పండగలంటూ ఆర్భాటం చేసి, ఇప్పుడేమో చండీయాగం అంటున్నారని పేర్కొన్నారు. గురువారం నల్లగొండలో గుత్తా సుఖేందర్రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వ్యక్తిగత ఇష్టాల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయటం బాధాకరమని ఆయన అన్నారు.

సహారా, ఈఎస్‌ఐ కేసుల్లో సీబీఐ దర్యాప్తు నుంచి బయట పడటానికేనా చండీయాగం అని కేసీఆర్ను గుత్తా సూటిగా ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో కాలువల షట్టర్లను మూసివేసి సాగర్ నీటిని ఖమ్మం జిల్లాకు తరలించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. నీరు  అవసరమైతే షట్టర్లు ఎత్తుకోవాలని గుత్తా ప్రజలకు సూచించారు. 

జిల్లా మంత్రి చెప్పినా సాగర్ అధికారులు మాట వినటం లేదని అంతా అనుకుంటున్నారని... అలాంటప్పుడు సదరు మంత్రి ఎందుకని ఎంపీ గుత్తా నిలదీశారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ పర్యటన ముగించుకుని బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యారు.

అయితే గతంలో కేంద్ర కార్మిక మంత్రిగా  కేసీఆర్...ఈఎస్ఐ భవనాల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ కేసుల నుంచి బయటపడేందుకే కేసీఆర్ ఢిల్లీ పర్యటన అని ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘ఆప్‌’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు

కరోనా వ్యాక్సిన్‌ ‘రెడీ టూ యూజ్‌’ : రష్యా మంత్రి

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌