More

వైకుంఠ ద్వార దర్శనం.. ముక్తికి మార్గం

8 Jan, 2017 22:34 IST

వెదురుపాక(రాయవరం) :
వైకుంఠ ద్వార దర్శనం ముక్తి కి మార్గమని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్‌) అన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆదివారం భక్తులనుద్దేశించి గాడ్‌ మాట్లాడుతూ శ్రీవైష్ణవ క్షేత్రాల్లో దేవతల కాల ప్రమాణాలను బట్టి ఏడాదిలో రెండు భాగాలైన దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయనం పగలుగా ఉంటాయన్నారు. ఈ మకర సంక్రమణ ఉత్తరాయన ప్రవేశానికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకొంటారన్నారు. ముక్కోటి ఏకాదశుల పుణ్యఫలం ఒక్క రోజున లభించేలా చేసేదే ముక్కోటి ఏకాదశిగా అన్నారు. ఈ పర్వదినాన వైష్ణవాలయాల్లో శ్రీవారు ఉత్తర ద్వార దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత విజయ వేంకటేశ్వరస్వామి వారికి పీఠబ్రహ్మ కోట వీరవెంకటసత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్‌(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.
 
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘ఆప్‌’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు

కరోనా వ్యాక్సిన్‌ ‘రెడీ టూ యూజ్‌’ : రష్యా మంత్రి

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌