More

సుపుత్రుల వీరంగం...

17 Mar, 2014 14:14 IST
సుపుత్రుల వీరంగం...

తమ చేష్టలతో ఇద్దరు నేతల పుత్రరత్నాలు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఒకరు మద్యం మత్తులో వీరంగం వేస్తే.... మరొకరు ఏకంగా కానిస్టేబుల్పైనే దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి  వెళితే ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సుపుత్రుడు అరవింద్ యాదవ్కు కోపం వచ్చింది. దాంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ కానిస్టేబుల్పై చేయి చేసుకుని తండ్రి అధికార దర్పాన్ని కుమారుడు ప్రదర్శించాడు.

పాత బస్తీలోని హుస్సేనిఆలంలో హోలీ వేడుకలు నిర్వహించారు. అరవింద్‌ యాదవ్‌- కామదహన్‌ కార్యక్రమంలో పాల్గొని ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయడంతో బందోబస్తులో ఉన్న ట్రాఫిక్ను క్రమబద్దీకరించేందుకు యత్నించాడు.  అయితే రోడ్డుపై హోలీ ఆడవద్దని చెప్పినందుకు వంశీ అనే కానిస్టేబుల్‌పై అరవింద్ యాదవ్ దాడి చేసి చితక్కొట్టాడు.

గాయాలపాలైన వంశీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని.. హుస్సేన్‌ ఆలం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అరవింద్‌ యాదవ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అంజన్‌కుమార్‌యాదవ్‌ తన  కుమారుడుని కేసులో నుంచి తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో తన కుమారుడి తప్పేమీ లేదంటూ వెనకేసుకు రావటం విశేషం.

ఈ సంఘటన మరవకముందే మారో మాజీ మంత్రి కుమారుడు రవితేజ శంషాబాద్ విమానాశ్రయంలో తప్పతాగి తన స్నేహితులతో కలిసి హల్‌చల్‌ చేశాడు. మద్యం మత్తులో హంగామా సృష్టించారు. తప్పతాగి బార్ సిబ్బంది, పుష్పక్ బస్ డిపో కౌంటర్పై దాడికి పాల్పడ్డారు. తన స్నేహితుడు ఇంద్రజిత్‌తో కలిసి రవితేజ రచ్చ చేశాడు. ఎయిర్పోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చట్ట ప్రకారం రవితేజపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ఒకవేళ ఒత్తిళ్లు వచ్చినా లొంగేది లేదని పోలీసులు తెలిపారు.

ఇక తండ్రుల పరపతిని అడ్డం పెట్టుకొని నేతాశ్రీల తనయుడులు రెచ్చిపోవటం గతంలోనూ జరిగాయి కూడా. అవకాశం దొరికినప్పుడల్లా రాజకీయ నేతల కుమారుల వీరంగం వేస్తుండటం  ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు తమ పుత్రుల అత్యుత్సాహంతో నేతలు కంగారు పడుతున్నారు. ఎన్నికల వేళ తమ కుమారులు రెచ్చిపోతుండడంతో గాభరా పడుతున్నారు. ఇక తండ్రులు తమ వెనక కొండంత అండగా ఉండటంతో పుత్నరత్నాలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్‌బో బేబీ!

గాన సరస్వతి

Seshanka Binesh: పేదపిల్లల గుండెచప్పుడు

Chennamaneni Padma: ఆవులే ఆమె సర్వస్వం

ఎదుగుతున్నానుకున్నాడు..సడెన్‌ బ్రేక్‌లా ఫుట్‌పాత్‌పై పడ్డాడు అదే..