More

క్యాబ్ తరహాలో అద్దెకు ఆర్టీసీ బస్సులు

15 Nov, 2016 08:44 IST
క్యాబ్ తరహాలో అద్దెకు ఆర్టీసీ బస్సులు

- 24 గంటల పరిమితి ఎత్తివేత.. ఇక 8 గంటలకూ సై!
- సిటీ బస్సులకై తే 4 గంటలకు
- స్పేర్ బస్సులతో ప్రత్యేక విభాగం ఏర్పాటు
- ముఖ్యమంత్రి ఆదేశంతో ప్రారంభించిన ఆర్టీసీ
 
 సాక్షి, హైదరాబాద్:
కార్ల తరహాలో ఇక ఆర్టీసీ బస్సులు కూడా అద్దెకు లభించబోతున్నాయి. ఆర్టీసీ బస్సులు అద్దెకివ్వటం కొత్త కానప్పటి కీ.. క్యాబ్‌ల తరహాలో ఇన్ని గంటలు, ఇన్ని కిలోమీటర్లు అంటూ కొత్త టారిఫ్‌తో అద్దెకు సిద్ధపడటమే విశేషం. పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం బస్సులు అద్దెకు దొరికేవి. అయితే కచ్చి తంగా 24 గంటలకు తగ్గకుండా తీసుకుంటేనే ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చేది. ఇప్పుడు ఆ నిబంధనను సడలించి కనీసం 8 గంటలు, సిటీ బస్ అరుుతే కనీసం 4 గంటలకు తగ్గకుండా అద్దెకిచ్చేందుకు ఆర్టీసీ సిద్ధపడింది. తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని గట్టెక్కించే క్రమంలో స్వయంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత జూన్‌లో ఉద యం నుంచి రాత్రి వరకు కేసీఆర్ నిర్వహించిన మారథాన్ సమీక్షలో ఈ సూచన చేశారు.

ఆ మేరకు అధికారులు ఇప్పుడు అద్దెకు బస్సులు ఇచ్చే కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. గరుడ ప్లస్, గరుడ, రాజధాని, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, హైదరాబాద్‌లో నడుస్తున్న సిటీ బస్సులను అద్దెకు ఇవ్వనున్నారు. విహార యాత్రలు, తీర్థ యాత్రలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు.. తదితరాలకు బస్సులు అందుబాటులో ఉంటారుు. ఒకవేళ బస్సులు మరమ్మతులకు గురైతే వాటి స్థానంలో పంపేందుకు కొన్ని బస్సులను స్పేర్‌లో సిద్ధంగా ఉంచుతారు. వాటిని ఇప్పుడు అద్దెలకు తిప్పాలని నిర్ణరుుంచారు.

 అద్దె ధరలిలా..
 జనవరి నుంచి జూన్ వరకు, అక్టోబర్ నెల.. దీన్ని పీక్ సీజన్‌గా ఆర్టీసీ భావిస్తుంది. ఆయా నెలల్లో ఓ రకమైన అద్దె.. అక్టోబర్ మినహా జూలై నుంచి నవంబర్ వరకు మరో అద్దెను నిర్ణరుుంచారు. 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24 గంటలకు విడివిడిగా ధరలు ఉంటారుు. కనిష్ట సమయానికి గరిష్టంగా 200 కి.మీ. దూరాన్ని ఫిక్స్ చేశారు. ఆ తర్వాత ప్రతి స్లాబ్‌కు కిలోమీటర్లను 250, 300, 330, 360, 390, 420, 450, 480 లుగా నిర్ధారించారు. పీక్ సీజన్‌లో పల్లె వెలుగుకు 8 గంటలకు రూ.6,500, 10 గంటలకు రూ.8 వేలు, 12 గంటలకు రూ.9,500 ఆ తర్వాత ప్రతి రెండు గంటలకు రూ.వెరుు్య చొప్పున అదనంగా వసూలు చేస్తారు. సాధారణ నెలల్లో ఇది రూ.500 చొప్పున ఆయా స్లాబ్‌లలో తక్కువగా ఉంటుంది.

ఎక్స్‌ప్రెస్‌లో పీక్ సీజన్‌లో కనిష్ట స్లాబ్‌కు రూ.7,600, ఆ తర్వాత రూ.9,500, 11,400, 12,600, 13,700, 14,900, 16 వేలు, 17,100, 18,300గా.. సాధార ణ నెలల్లో రూ.400 నుంచి రూ.600 మేర తక్కువగా నిర్ధారించారు. డీలక్స్‌లో కనిష్టంగా రూ.11 వేలు, గరిష్టంగా రూ.17,800, సూపర్ లగ్జరీలో కనిష్టంగా రూ.11,400, గరిష్టంగా రూ.18,300 వసూలు చేస్తారు. రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌లకు మాత్రం కచ్చితంగా 24 గంటలు, 500 కి.మీ.ధరనే లెక్కకట్టి ఇవ్వాల్సి ఉంటుంది. రాజధానికి రూ.29,500, గరుడకు రూ.34,500, గరుడ ప్లస్‌కు రూ.40,500 ధర వసూలు చేస్తారు. పరిమితి దాటితే ప్రతి అదనపు గంటకు అదనపు మొత్తాన్ని వసూలు చేస్తారు. చార్జీలపై సర్వీసు పన్ను 6 శాతంగా నిర్ధారించారు.
 
 సిటీ బస్సులకు ఇలా..
 సిటీ బస్సులు 4, 6, 8, 10, 12, 14, 16 గంటలకు, కి.మీ. పరిధి 60 నుంచి మొదలై ప్రతి స్లాబ్‌కు 30 కి.మీ. చొప్పున అదనంగా నిర్ధారించారు. ఆర్డినరీ బస్సు చార్జీ కనిష్టంగా రూ.3,500 గరిష్టంగా  రూ.8,500, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో లగ్జరీ రూ.4 వేలు- రూ.9 వేలుగా నిర్ధారించారు. సిటీ శీతల్‌కు 24 గంటలు, 300 కి.మీ., మెట్రో లగ్జరీకి 24 గంటలు, 500 కి.మీ.గా, ధర రూ.18,600, రూ.27,000గా నిర్ధారించారు. బస్సు లకు కాషన్ డిపాజిట్ కూడా ఉంటుంది. ప్ర యాణం పూర్తరుున తర్వాత దాన్ని తిరిగి చెల్లిస్తారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బుజ్జగింపు.. భరోసా

పాత బస్తీని హెరిటేజ్‌ సిటీగా మార్చాలి

ఆగమేఘాల కమలం

రద్దీ వేళల్లో ఎక్కడిక్కడ ఆగిన ట్రాఫిక్‌

బీమాతో ధీమాగా..