More

కువైట్‌ నుంచి విముక్తి పొంది స్వదేశానికి

9 Feb, 2017 04:10 IST

విదేశంలో అనారోగ్యానికి తోడు కోర్టు కేసులో చిక్కుకున్న రాష్ట్రవాసి

సాక్షి, హైదరాబాద్‌:
తీవ్ర అనారోగ్యానికి తోడు కోర్టు కేసు కూడా ఎదురుకావడంతో దేశం కాని దేశంలో నిస్సహాయుడిగా మారిన ఓ అభ్యాగుడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో స్వదేశానికి రప్పించింది. నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు మండలం పచ్చల నడ్కుడ వాసి మెడవేటి ప్రశాంత్‌ ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లా రు. కొంత కాలానికి 2 మూత్రపిండాలూ చెడిపోయి అనారోగ్యా నికి గురై అక్కడి ఆస్పత్రిలో చికిత్సకు చేరాడు. ప్రశాంత్‌ను స్వదే శానికి తరలించేందుకు సహకరించాలని అతడి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేయడంతో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అప్పట్లో ఈ విష యాన్ని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు.

ప్రశాంత్‌పై కువైట్‌లో ఓ కేసు విచారణ జరుగుతోం దని, దీనికి సంబంధించి కొంత మొత్తాన్ని అతడు చెల్లించాల్సి ఉందని ఎంబసీ అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ప్రశాంత్‌ చెల్లించాల్సిన బకాయిలను మన రాయబార కార్యాలయం చెల్లించడంతో అతడికి కేసు నుంచి విముక్తి లభించింది. దీంతో ప్రశాంత్‌ను బుధవారం  శంషాబాద్‌ విమానాశ్రయానికి తీసుకొ చ్చారు. నిమ్స్‌కి తరలించి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బీదర్‌ కేంద్రంగా ‘నిట్రావెట్‌’ దందా

ఆర్టీసీలో ‘మానసిక’ టెన్షన్‌!

నరకాసురులతో అప్రమత్తంగా ఉండాలి

గవర్నర్‌ తమిళిసై దీపావళి శుభాకాంక్షలు 

కేసీఆర్‌కు రెండుచోట్లా ఓటమి తథ్యం