More

బాంబు పేలుడు: పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ రైలు

7 Jun, 2015 08:58 IST

కరాచీ: పాకిస్థాన్ సింధు ప్రావెన్స్లో రైల్వే ట్రాక్పై బాంబు పేలుడు సంభవించింది. ఆ సమయంలో ట్రాక్పై వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 10 మంది రైలు ప్రయాణికులు గాయపడ్డారని పాకిస్థాన్ రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

జాఫర్ ఎక్స్ప్రెస్ రావల్పిండి నుంచి క్విట్టాకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. పేలుడు వల్ల రైల్వే ట్రాక్ ధ్వంసమైందని... సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లను వేరే మార్గంలో నడిపిస్తున్నట్లు వివరించారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఏ సంస్థ ప్రకటించలేదు.    
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అమెరికా ఎంక్యూ–9 డ్రోన్‌ పేల్చివేత

చికున్‌ గున్యాకు తొలి వ్యాక్సిన్‌

ప్రపంచంలోనే తొలిసారిగా కంటిమార్పిడి

Israel-Hamas war: దిగ్బంధంలో ఆస్పత్రులు

US-India Relations: బలమైన రక్షణ బంధం