More

'ఒబామా వ్యూహాత్మక అడుగులు'

28 Jan, 2015 04:24 IST
బరాక్ ఒబామా

 బీజింగ్: భారత్-చైనా, భారత్-రష్యాల మధ్య సంబంధాలను దెబ్బతీయాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చైనా మీడియా భారత్‌ను హెచ్చరించింది. ఆసియాలో చైనాను అదుపుచేసేందుకు అమెరికా భారత్‌ను ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపించాయి. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ను కీలక శక్తిగా నిలబెట్టడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ యూఎస్ పక్షాన నిలుస్తున్నారని షాంగైలోని అంతర్జాతీయ వ్యవహారాల యూనివర్సిటీ పరిశోధకుడు హూ జీయాంగ్ విమర్శించారు.

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్‌కు మద్ధతుగా నిలుస్తామని వ్యాఖ్యానించడంతో ఒబామా మోదీని తనవైపు తిప్పుకున్నారని పేర్కొన్నారు. కానీ, ఆర్థికాభివద్ధికి, ప్రాంతీయ సుస్థిరతకు చైనా- భారత్ సంబంధాలు కీలకమైనవని మోదీ గుర్తించాలన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ప్రతి ముప్పును తీవ్రంగా పరిగణిస్తాం.. ఖలిస్థానీ బెదిరింపులపై కెనడా

పాక్‌లో అంగతకుల కాల్పులు.. లష్కరే తోయిబా మాజీ కమాండర్‌ మృతి

ఆస్ట్రేలియాలో ఘనంగా మంత్రి కాకాని జన్మదిన వేడుకలు

రిషి సునాక్‌ ఇంట దీపావళి వేడుక

ఆ 8 మందికి మరణశిక్షపై భారత్‌ అప్పీల్‌