More

దావూద్ ఇబ్రహీం ఆచూకీ దొరికింది

27 Dec, 2014 16:01 IST
దావూద్ ఇబ్రహీం ఆచూకీ దొరికింది

భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అండర్ వరల్డ్  డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ కనుగొన్నారు. పాకిస్థాన్లోని కరాచీ నగర శివారు  ప్రాంతం క్లిఫ్టన్ నుంచి దావూద్ ఫోన్లో మాట్లాడినప్పటి సంభాషణలను ఓ పాశ్చాత్య నిఘా సంస్థ రికార్డు చేసింది.

ఆస్తి ఒప్పందానికి సంబంధించి దుబాయ్లో ఉంటున్న ఓ వ్యక్తితో దావూద్ మాట్లాడిన సమయంలో సంభాషణల్ని రికార్డు చేశారు. రెండు దశాబ్దాల క్రితం దావూద్ పాకిస్థాన్ పారిపోయిన తర్వాత భారత నిఘా సంస్థలు అతని ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో భారత్కు దావూద్ను అంతం చేసే అవకాశం వచ్చినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. భారత్ కమెండోలు దావూద్ ను టార్గెట్ చేసినపుడు, కొన్ని క్షణాలు ముందు భారత్కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేసి కాల్చొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు కథనాలు వెలువడ్డాయి.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

పా​క్‌కు చైనా అందిస్తున్న ఆయుధ సహకారమెంత?

కొత్త రూపంలో కోవిడ్‌-19.. భారత్‌కూ తప్పని ముప్పు?

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత

15 ఏళ్లకే అమ్మ.. 33కు అమ్మమ్మ.. కొత్త ట్విస్ట్‌ ఇదే!

బంగ్లాదేశ్‌ ఎన్నికలతో భారత్‌, పాక్‌, చైనాలకు లింకేమిటి?