More

కూలిన యుద్ధవిమానం: ఒకరు మృతి

30 Oct, 2014 10:33 IST

లాస్ ఏంజిల్స్: యూఎస్లో ఓ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. కాలిఫోర్నియా వెంట్యురా కౌంటీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. విమానం కుప్ప కూలిన వెంటనే మంటలు భారీగా ఎగసిపడ్డాయని... అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చిందన్నారు.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు విచారణ జరుపుతుందని చెప్పారు.  ఈ ప్రమాదం బుధవారం సాయంత్రం చోటు చేసుకుందని ఉన్నతాధికారులు వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

శశిథరూర్‌లాగా ఇంగ్లీష్‌ గిట్ల మాట్లాడాలే...

దక్షిణ గాజాపై ఇజ్రాయెల్‌ గురి

ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

వామ్మో చైనా ఇన్ఫెక్షన్‌

ఇమ్రాన్‌ స్థానంలో గోహర్‌ అలీ