More

బోటులో పేలుడు: విదేశీ పర్యాటకురాలు మృతి

15 Sep, 2016 11:17 IST

జకార్తా : ఇండోనేషియాలోని బాలి ద్వీపం సమీపంలో విదేశీ పర్యాటకులతో వెళ్తున్న బోటులో గురువారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఇండేనేషియా పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 35 మంది విదేశీయులు ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. వీరంతా పోర్చుగల్, జర్మనీ, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, బ్రిటన్ దేశాలకు చెందిన వారని తమ ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు. అలాగే నలుగురు బోటు సిబ్బంది కూడా ఉన్నారన్నారు. గురువారం ఉదయం పశ్చిమ బాలిలోని పడంగ్ బాయి పోర్టు నుంచి బోటు బయలుదేరిన ఐదు నిమిషాలకే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. అయితే పేలుడు ఇంజన్ ప్రాంతంలో నుంచి వచ్చిందని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఇజ్రాయెల్‌లో పర్యటించిన ఇవాంకా ట్రంప్‌

దుబాయ్‌లో కొనసాగుతున్న సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు

భారతీయ విద్యార్థి నాలుగేళ్లుగా మిస్సింగ్‌.. ఆచూకీ చెబితే 8 లక్షల రివార్డ్‌

Today Headlines: ఇవాళ్టి ముఖ్యమైన వార్తలు

హమాస్‌కు ఇజ్రాయెల్ ప్రధాని అల్టిమేటం