More

పాకిస్తాన్ను వెనుకేసుకొచ్చిన చైనా!

10 Jun, 2016 14:23 IST

బీజింగ్: పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని అంతర్జాతీయ సమాజం గౌరవించాలని చైనా పేర్కొంది. ఇటీవల పాకిస్తాన్ భూభాగంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో తాలిబాన్ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ మృతి చెందిన  విషయం తెలిసిందే. తమ భూభాగంలో అమెరికా డ్రోన్ దాడులకు పాల్పడటాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ విషయమై శుక్రవారం చైనా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి హోంగ్ లీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉగ్రవాద నిర్మూలనకు ఎంతగానో కృషి చేస్తున్న పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని ప్రపంచదేశాలు గౌరవించాలని పేర్కొన్నారు.

ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, యూఎస్లతో కూడిన క్వాడ్రీలేటరల్ కొ ఆర్డినేషన్ గ్రూప్(క్యూసీజీ).. ఆప్ఘనిస్తాన్ పునరుద్దరణ లక్ష్యంతో పనిచేస్తుందని, ఈ విషయంలో ఉమ్మడి ప్రయత్నాలు జరగాలని ఆయన పేర్కొన్నారు. డ్రోన్ దాడిలో మృతి చెందింది ఓ పాకిస్తాన్ డ్రైవర్గా పేర్కొంన్న హోంగ్ లీ.. అమెరికా డ్రోన్ దాడిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

గాజా.. మరుభూమి! 

అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న కొత్త కరోనా: ఈ లక్షణాలుంటే..!

హమాస్‌-ఇజ్రాయిల్‌ మధ్య కుదిరిన డీల్‌!

 ఫ్రీ మీల్స్‌ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే?

ఉద్యోగాలు పోతున్నాయి.నాకు మాత్రం సూపర్‌: క్రేజీ ‘బారీ’ ప్రకటన ఏంటంటే!