More

పెదవుల కదలికే పాస్వర్డ్!

5 Oct, 2014 17:47 IST
పెదవుల కదలికే పాస్వర్డ్!

లండన్: పెదవుల కదలికే కంప్యూటర్ పాస్వర్డ్ కానుంది! పెదవుల కదలికను గ్రహించే కంప్యూటర్లు త్వరలో రానున్నాయి. మనుషులు మాట్లాడేటపుడు ప్రతి ఒక్కరి పెదవుల కదలికల్లో తేడా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది.

జోర్డాన్లోని ముటా యూనివర్సిటీ పరిశోధకుడు అహ్మద్ హసానత్ పెదవుల కదలికను గ్రహించే సాఫ్ట్వేర్ను రూపొందించారు. మనుషులు మాట్లాడేటపుడు నోరు, పెదవుల కదలికలను కెమెరా ద్వారా గుర్తిస్తారు. మాట్లాడేటపుడు ఆ వ్యక్తి పల్లు ఎన్ని కనిపిస్తాయి తదితర విషయాలను గ్రహిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఓ వ్యక్తి మాట్లాడిన మాటలను అతని నోటి కదలికను అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే 80 శాతం వరకు కచ్చితంగా గుర్తిస్తుంది. వ్యక్తి పెదవుల కదలిక ఆధారంగా కంప్యూటర్లో లాగిన్ కావచ్చని హసానత్ చెబుతున్నారు. అలాగే బయోమెట్రిక్ సెక్యూరిటీలోనూ విజువల్ పాస్వర్డ్ పద్ధతి ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఆలస్యం వద్దు.. నిషేధించండి: బైడెన్‌కు లేఖ

పసివాడిని బావిలో తోసేసిన బాలిక.. తరువాత?

స్పేస్ ఎక్స్ 250వ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ హర్షం

గాజాపై మళ్లీ బాంబుల వర్షం.. 175 మంది మృతి

తుపానులకు పేర్లు ఎందుకు? ఎవరు పెడతారు?